పవన్ పుస్తకం వెనుక త్రివిక్రమ్..?

pavan-trivikram

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా టాలీవుడ్ తెరంగ్రేటం చేసిన పవన్ కళ్యాణ్ కొద్దికాలంలోనే తన మేనరిజంతో ఫ్యాన్స్ ను ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత చిరంజీవి ఏర్పాటుచేసిన ప్రజారాజ్యం పార్టీలో ప్రధానపాత్ర పోషించారు. ప్రతిపక్షాలను తనదైనశైలిలో ఏకిపారేసి ఫుల్ టైం పొలిటిషియన్ అని అనిపించుకున్నారు. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇష్టంలేని పవన్ గతకొంతకాలంగా చిరుతో అంటిముట్టనట్టుగా వ్యవహారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ కొత్తపార్టీ ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపిస్తోన్నారట. ఈ విషయంపై తన హితులు, సన్నిహితులతో పలు దఫాలుగా చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు పవన్ టీం పార్టీ ఏర్పాటు చేయడానికే ఆసక్తి చూపించిందట. మార్చి 12న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని తెలుపాలని భావించారట. అదేరోజు రాజమండ్రిలో మాజీ సీఎం కిరణ్ పార్టీ ప్రకటన చేయనుండడంతో ఈ ఆదివారమే జూబ్లిహాలులో కొత్త పార్టీ ప్రకటన, విధివిధానాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోందంటున్నారు.

ఈ సమావేశంలోనే రాజకీయాలపై పవన్ రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇందులో ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి ? సామాన్యుడి ఆకలి బాధ ఎలా తీర్చాలి ? సమాజం మారాలంటే ఏం చేయాలి ? అనే అంశాలపై పవన్ తన అభిప్రాయాలను వ్యక్తంచేసారట. అంతేకాదు పవన్ పుస్తకం వెనుక త్రివిక్రమ్ హాస్తం ఉందట. త్రివిక్రమ్ మాటలు ఆయుధాలుగా మార్చుకుని తన ఆవేశంతో మిళితం చేసి పవన్ రాసిన పుస్తకం ఇప్పడు  రాజకీయ వర్గాలలో హట్ టాపిక్ గా మారింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.