పవన్ వెనక ఎవరున్నారు..?

Pawan-kalyan-political-party

రాజకీయాలంటే మాటలు కాదు. ఎన్నికల్లో పోటీ చేయాలన్నా, పార్టీ పెట్టాలన్నా అంతా కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టబోతున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయనకు ఆర్ధిక అండదండలు అందించేది ఎవరు..? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ విషయంలో పీవీపీ సంస్థ అధినేత పొట్లూరి వి. ప్రసాద్ ఇప్పుడు పవన్ కు ఆర్ధిక తోడ్పాటు అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఇంతకు క్రితం వరకు ప్రసాద్ వైయస్సార్ సీపీ అధినేత జగన్ వద్ద వున్నారు. ఆయనతో విభేదాలు రావడంతో పవన్ వద్దకు చేరినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా పవన్ తో ఓ సినిమా చేస్తున్నట్టు కూడా ఆ మధ్య ప్రకటించారు. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పవన్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ప్రసాద్ సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడట.

Have something to add? Share it in the comments

Your email address will not be published.