పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి

accident-dedulur-11114

దెందులూరు, నవంబర్ 1: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు చెక్ పోస్ట్ సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని టవేరా వాహనం ఢీకొట్టిన ఘటనలో ఏలూరుకు చెందిన ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రావులపాలెం నుంచి ఏలూరు వెళుతున్న సమయంలో దెందులూరు చెక్ పోస్ట్ సమీపంలో ఆగి ఉన్న లారీని టవేరా వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ సరిత సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.