పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా కోడి పందేలు

Kodi-pandelu

పోలీసు హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. సోమవారమే ప్రారంభమైన ఈ పందేలు ఇవాళ మరింత జోరందుకున్నాయి. ఒక్కో పందెంలోనూ పందెంరాయుళ్లు లక్షలాది రూపాయలను బెట్టింగ్ కాస్తున్నారు. జిల్లా పరిధిలోని భీమవరం, వీరవరం, వెంప, పాలకోడేరు, ఆకివీడు, ఉండి తదితర ప్రాంతాల్లో కోడిపందేలను నిర్వహిస్తున్నారు. ఈ పందేలను వీక్షించేందుకు జిల్లా వాసులే కాక విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు నగరాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.