పాకిస్థాన్ లో ఆమ్ ఆద్మీ

Pakistan-AAP

పాకిస్థాన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటీ అని ఆశ్చర్యపోతున్నారా…? అవునండీ అది ఆమ్ ఆద్మీ పార్టీనే.. భారతదేశంలో మాదిరిగానే పాకిస్థాన్ లో కూడా ఆమ్ ఆద్మీ అవతరించింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ కు పాకిస్థాన్ రాజకీయాలను మార్చాలని ఎందుకు అనిపించిందనేగా మీ డౌట్… కేజ్రీవాల్ స్ఫూర్తితో పాకిస్థాన్ లో కొందరు సామాజిక ఉద్యమకారులు, గుజ్రన్ వాలాకు చెందిన కొందరు మితవాదులు కలిసి ఆమ్ ఆద్మీ పేరిట పాకిస్థాన్ ఎన్నికల సంఘం వద్ద ఓ పార్టీని రిజిస్టర్ చేశారు.

కేజ్రీవాల్ తరహాలోనే పాకిస్థాన్ లోని ఆమ్ ఆద్మీ నేతలు కూడా పాక్ లోని పంజాబ్ అసెంబ్లీ వద్ద నిరవధిక దీక్ష చేపట్టబోతున్నారట. పోలీసుల సంస్కరణలు, వేధింపుల చట్టం అమల్లోకి తీసుకురావాలని వారు ఆందోళన చేపట్టనున్నారు. పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా కలలు నెరవేర్చాలన్నది తమ ఉద్దేశ్యమని పాక్ ఆమ్ ఆద్మీ నేతలు ప్రకటించారు. జిన్నా కలలు కన్నది ఇప్పుడున్న పాకిస్థాన్ కాదని.. ఏ ఆశయంతో పాకిస్థాన్ ఏర్పాటైందో అది నెరవేరలేదని పాక్ ఆప్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.