పాట్నా రావణ దహనంలో తొక్కిసలాట – 32 మంది మృతి

పాట్నా, అక్టోబర్ 3: బీహార్ రాష్ట్రం లోని పాట్నా లో శుక్రవారం జరిగిన దసరా వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గాంధీ మైదానంలో నిర్వహించిన రావణ దహనం దిష్టి బొమ్మ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో 32 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్రగాయలపాలయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో పాట్నా మెడికల్ కళాశాలకు తరలించారు. మృతిచెందిన వారిలో 25 మంది మహిళలు 5గురు చిన్నారు ఉన్నట్లు బీహార్ హోం శాఖ కార్యదర్శి అమిర్ సుభానీ వెల్లడించారు. మహాత్మా గాంధీ మైదానంలో జరిగిన దసరా వేడుకలు ప్రజలు పాల్గొని తిరిగి వెళ్లేటప్పుడు ఈ ఘటన సంభవించింది. ప్రతి సంవత్సరం జరిగే దసరా వేడుకల్లో రావణ దహన దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం అతి ముఖ్యమైనది. పాట్నా ప్రజలు దీనిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కార్యక్రమాన్ని వీక్షించడానికి సుమారు 50 వేల మంది ఈ వేడుకల్లో పాల్గొంటారు. విద్యుత్ తీగ కింద పడిందని ఎవరో చేసిన పుకారు వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఈ విషయంపై అధికారులు ఎవ్వరు ఇంత వరకు నిర్ధారించలేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.