పాఠశాల విద్యపై శాసనసభలో చర్చ

హైదరాబాద్, నవంబర్ 14: ప్రశ్నోత్తరాల సందర్భంగా పాఠశాల విద్యపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. విద్యార్థులు లేని పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని పాఠశాలల్లో కలపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. దీనిపై అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. దీనిపై మంత్రి సమాధానం ఇచ్చినప్పటికీ దానికి సంతృప్తి చెందని భారతీయ జనతాపార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

 

bjp laxman-14ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారని అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను వేరే చోటికి బదిలీ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రయత్నించాలేతప్ప మూసివేయడంవల్ల గిరిజన విద్యార్ధులు విద్యకు దూరమవుతారని లక్ష్మణ్ పేర్కొన్నారు. పాఠశాలలు మూసివేయాలంటే ఒక్క హైదరాబాద్ లోనే 450 ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని తెలిపారు. జీవో నెం. 6లో మార్పులు చేయాలని, బడిబాట కార్యక్రమాన్ని సమర్ధంగా అమలు చేయాలని లక్ష్మణ్ కోరారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాల్లోని 2-3 పాఠశాలలను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యకు తగిన ఉపాధ్యాయులు లేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ సభ దృష్టికి తెచ్చారు.

 

jagadeesh reddy 14హెతుబద్దీకరణ అంటే నాణ్యమైన విద్యాను అందించే ప్రక్రియ అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా జగదీష్ రెడ్డి సమాధానమిస్తూ. హెతుబద్దీకరణను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడం లేదని, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించే నిర్ణయం తీసుకున్నామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కొన్ని పాఠశాలల్లో 20 మంది విద్యార్ధులు ఉంటే 10 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పారు. అటువంటి చోట అవసరమైన వారిని ఉంచి, ఎక్కువగా ఉన్నవారిని వేరే చోట వినియోగంచుకుంటున్నామని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.