పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్ర

హైదరాబాద్: తెలంగాణ భాష, చరిత్ర ప్రతిబించేలా పాఠ్యపుస్తకాలను రూపొందించాని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుండి రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్రను తెలిపే కథలు, పోరాటాలు, పాటలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పుస్తకాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.

తెలంగాణలోని 10 జిల్లాల్లో ప్రజలు వాడే భాష పాఠ్యపుస్తకాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు చెరువుల ప్రాధాన్యతను తెలిపేలా పాఠ్యాంశాన్ని రూపొందిస్తున్నారు. కొత్తగా రూపొందించే పాఠ్యాంశాల్లో పాటలు, తత్వం, కవితలు, జానపదరూపాలకు చోటు దక్కనుంది. గిరిజన, ఆదీవాసీలకు సంబంధించిన సంప్రదాయాలు, చరిత్రను ప్రతిబింబించేలా పాఠ్యాంశాలు రూపొందనున్నాయి.government schools-ts

ఐదవతరగతి వరకు చదువుకొనే విద్యార్థులకు రచయితల కమిటీ పాఠ్యాంశాలను తయారు చేయాలని నిర్ణయించింది. 6, 7 తరగతుల విద్యార్థులకు ఇప్పటికే రాసిన పాఠ్యాంశాలను వాడుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ సామెతలు, సూక్తులు, లోకోక్తులను పాఠ్యాంశాల్లో పొందుపర్చనున్నారు. పదాలకు అర్థాలను ఇచ్చేందుకు తెలంగాణలో వాడుకలో ఉండే పర్యాయపదాలను ఉపయోగించాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది.

అదే విధంగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, తెలంగాణలో స్పూర్తిదాతలు, పోరాటాలు, తెలంగాణ ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణలోని వివిధ పనులకు సంబంధించిన కళారూపాలను పాఠ్యాంశాల్లో పొందుపర్చాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటుంది. జిల్లాల వారీగా మాండలీకాల స్వరూపాన్ని కూడ తయారు చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాఠ్యంశాల తయారీకి సంబంధించిన నివేదికను పూర్తి చేయాలని కమిటీ భావిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరానికి ఈ కమిటీ సూచించిన పాఠ్యాంశాలతో కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.