పారిశ్రామిక విధానం బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

హైదరాబాద్,నవంబర్ 27: రాష్ట్ర పారిశ్రామిక విధానం బిల్లును గురువారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అసెంబ్లీలో  ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు 2.7 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని పరిశ్రమలకు కేటాయిస్తామని ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉందని ఆయన అన్నారు. పరిశ్రమల విద్యుత్ కోసం ప్రత్యేక డిస్కంలు నెలకొల్పుతామని ఆయన తెలిపారు. ఇతర దేశాల్లోని పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసి నూతన పారిశ్రామిక విధానాన్నిరూపొందించినట్లు ఆయన వెల్లడించారు. పారిశ్రామిక ప్రోత్సాహం కింద బడ్జెట్ లో 522 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేసీఆర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.