పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం హేయమైన చర్య : గీతారెడ్డి

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహించడం హేయమైన చర్యని గీతారెడ్డి అభివర్ణించారు. సస్పెండ్ అయిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రే స్వయంగా తన పార్టీలోకి ఆహ్వానించడం నీచమైన సంస్కృతన్నారు. ఇది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమని తెలిపారు. తామిచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ చదవకుండానే తిరస్కరించడం దారుణమని ఆమె మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై చర్చించాలని కోరినా తమ విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదని గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఫిరాయింపులకు పాల్పడుతున్న శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లఘించి పార్టీ ఫిరాంయిపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పదవిలో కొనసాగే హక్కు చట్టబంధంగా లేదని జీవన్ రెడ్డి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.