పింఛన్లను నవంబర్ 8 నుంచి అందిస్తాం : కేటీఆర్

ktr 1హైదరాబాద్, అక్టోబర్ 28 : పింఛన్లను నవంబర్ 8 నుంచి అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వెయ్యి రూపాయల పింఛన్‌ లబ్ధిదారులకు ఒక నెల మాత్రమే నేరుగా నగదు రూపంలో ఇస్తామని, తదుపరి నెల నుంచి యథాతధంగా ప్రస్తుత విధానంలోనే పింఛన్ల చెల్లింపులను అందిస్తామని మంత్రి తెలిపారు.

అన్ని జిల్లాల నుంచి 40 లక్షల పింఛన్ దరఖాస్తులు అందాయని, ఇప్పటికి వరకు 19.27 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని మంత్రి తెలిపారు. ఆహార భద్రత కార్డుల కోసం 92.06 లక్షల దరఖాస్తులు రాగా, అందులో ఇప్పటికి వరకు  19.28 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని వెల్లడించారు. వచ్చే వారంలోగా మిగిలిన పింఛన్ల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని చెప్పారు. ప్రతి గ్రామం ఒక కేంద్రంగా పింఛన్ల చెల్లింపులు జరగాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.