పింఛన్ల అంశంపై పూర్తిస్థాయి చర్చకు సిద్ధం : కేసీఆర్

హైదరాబాద్, నవంబర్ 19: పింఛన్లకు సంబంధించి పూర్తి స్థాయి చర్చచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పింఛన్ల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం, సాంఘిక భద్రత కల్పించడం కోసమే ఈ ఆసరా పింఛన్ల పథకాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సమాజంలో ఉన్న వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లు గీత కార్మికులు, ఎయిడ్స్ బాధిత వ్యక్తులు, వికలాంగులు తదితరుల రోజువారి కనీస అవసరాలు తీర్చడమే ఈ పథకం యొక్క ఉద్దేశ్యమని తెలిపారు. గతంలో అందించిన సామాజిక భద్రత పింఛన్లు కనీస అవసరాలను తీర్చుకోవాడనికి కూడా సరిపోలేదన్నారు. గతంలో నెలకు వృద్ధులకు, వితంతువులుకు రూ 200, వికలాంగులకు రూ 500 పింఛన్లు అందజేశారన్నారు. వితంతువులకు, చేనేత, కల్లుగీత కార్మికులకు, వృద్ధులకు పింఛన్ రూ 200 నుంచి రూ 1000, వికలాంగులకు రూ 500 నుంచి రూ 1500 వరకు పింఛను ప్రభుత్వం పెంచడం జరిగిందని కేసీఆర్ తెలిపారు. ఆసరా ప్రస్తుతం పించన్ల పథకానికి సంవత్సరానికి సుమారు రూ 3350 కోట్లు వ్యయం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చుకు వెనాకాడకుండా ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రారంభించిందని వెల్లడించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పింఛన్ల కొరకు 39.63 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అర్హులైన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 24.21 లక్షల అర్హత కలిగినటువంటి లబ్దిదారులకు పింఛన్లను మంజూరు చేయడానికి గుర్తించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వెల్లడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.