పీఎస్ఎల్వీ-సీ26 ప్రయోగం విజయవంతం

నెల్లూరు, అక్టోబర్ 16: అర్ధరాత్రి దాటాక నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలోని భారత అంతరిక్ష పరిశోధకులు స్వదేశీ చోదకవ్యవస్థలోని మూడవ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సీని దిగ్విజయంగా రోదసిలోకి ప్రవేశపెట్టారు. 1,425 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ26 రాకెట్‌ మోసుకొంటూ గురువారం తెల్లవారుజామున 1.32 గంటలకు రోదసిలోకి దూసుకెళ్లి భూస్థిర ఉప కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ప్రయోగాన్ని వీక్షించిన ఇస్రో చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌, ఇతర శాస్త్రవేత్తల ముఖాల్లో ఆనందం వెల్లువిరిశాయి.  ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌ ప్రకటించారు. సహచర శాస్త్రవేత్తలను అభినందిస్తూ ఆలింగనం చేసుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.