పుట్టపర్తిలో వైభవంగా సత్యసాయి దీపోత్సవం

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శనివారం ఉదయం సత్యసాయి దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లావాసులు ఈ దీపోత్సవంలో పాల్గొని సత్యసాయి చిత్రపటాన్ని పుట్టపర్తి పురవీధుల్లో ఊరేగించారు. రెండు వేల మంది వెంట రాగా ఊరేగింపు చిత్రావతి నది వరకు సాగింది. అక్కడ 1008 దీపాలు వెలిగించగా చిత్రావతి నదీ తీరం దీపకాంతులతో కళకళలాడింది. సత్యసాయి చిన్ననాటి నుంచి నడయాడిన ఈ నదీ తీరాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.