పుట్టిన ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు: జగన్

YS-jagan

పుట్టిన ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారంటూ చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. సోనియా గీసిన గీత దాటకుండా కిరణ్ ప్రజలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సమైక్యమన్న మాట కూడా మాట్లాడకుండా అసెంబ్లీలో ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో వాదన వినిపిస్తున్నారని అన్నారు. సమైక్యవాదుల నినాదాలు కిరణ్, చంద్రబాబులకు గుండెలు పగిలేలా వుండాలన్నారు. జగన్ సమైక్య శంఖారావాన్ని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పున: ప్రారంభించారు. పలు గ్రామాల్లో పర్యటించిన జగన్ గతానికి భిన్నంగా వ్యవహరించారు. ప్రతి చోటా ప్రసంగం లేకుండా చూసుకున్నారు. రోజు మొత్తం మీద ఒక చోట మాత్రమే ఆయన ప్రసంగించడం విశేషం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.