పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు చేయండి : కేసీఆర్

విద్యాభివృద్ధికి సంహకరించండి మంత్రి స్మృతి ఇరానీకి వినతి

పర్యావరణ అనుమతులు, కాంపా నిదుల విడుదలపై మంత్రికి విజ్ఞప్తి

ఢిల్లీలో ముగిసిన సీఎం పర్యటన

 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై పేర్కొన్న అంశాలమీద స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఆ చట్టంలోని షెడ్యూలు 9, 10లో పేర్కొన్న అంశాలు అక్షరాలా అమలు చేసేందుకు కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అసలు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం ఏ ప్రాంతంలోని సంస్థలు ఆ రాష్ట్రానికే చెందుతాయని, కానీ హైదరాబాద్‌లోని సంస్థల విషయంగా వివాదాలు వస్తున్నాయని ఆయనకు వివరించినట్లు సమాచాం. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదునని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. బిల్లులో పొందుపరచిన అంశాలు అమలయ్యేలా చర్యలు చేపడతామని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయాలు కూడా తీసుకుంటామని రాజ్ నాథ్ సింగ్ కేసీఆర్ కు తెలిపారు. సమావేశం అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్ కుమార్ మీడియాకు ఈ భేటీ వివరాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న వివిధ ఉన్నత సంస్థలు, పరిశోధనా సంస్థలు తెలంగాణ రాష్ర్టానికే చెందుతాయని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొనబడిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుళ్లామన్నారు.

Smruthi Iraniవిద్యాభివృద్ధికి సహకరించండి

తెలంగాణలో విద్యాభివృద్ధికి సహకరించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీకి కేసీ ఆర్ విజ్ఞప్తి చేశారు.  హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని, దీంతోపాటు హైదరాబాద్‌లో ఇప్పటికే శంకుస్థాపన జరిగిన నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు. వాటి నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరిస్తే రాష్ట్ర తమ వంతు వాటాను వెంటనే విడుదల చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ లో గిరిజన వర్సిటీ త్వరగా ఏర్పాటు చేయాలని కేసీఆర్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానిని కోరారు.

Prakash Javadekarపర్యావరణ అనుమతులు ఇప్పించండి

తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఇప్పించాలని కేసీఆర్ కేంద్ర సమాచార, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను కోరారు.  నెట్టెంపాడు, కల్వకుర్తి, సింగరేణిలకు పర్యావరణ అనుమతులు రాకపోవడంతో అభివృద్ధి నిలిచిన విషయాన్ని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంపా నిధుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం వాటా రూ. 1100 కోట్లు ఉందని, ఇందులో నుంచి అడవుల పెంపకానికి సగమైనా నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో తెలంగాణలో అటవీ అభివృద్ధికి నిదులు పెంచాలని కేసీఆర్ కోరగా.. ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. కేంద్ర మంత్రులను కలిసిన సీ ఎం బృందంలో తెరాస ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ వేణుగోపాలచారి, పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.