పులి మృతిపై వేగవంతమైన దర్యాప్తు

Tiger-dead

మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కలకలం రేపిన పెద్దపులి మృతిపై మిస్టరీ వీడుతోంది. పులిని చంపిన కేసులో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పులి కాళ్లు, గోళ్లు తదితర అవయవాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

దీంతో విడివిడిగా విచారణ చేపట్టిన పోలీసులు, రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులు పులి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈనేపధ్యంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు చివరకు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మన్ననూరు కు చెందిన పలువురు పశువుల కాపరులను పోలీసులు విచారించడంతో నిందితుల ఆచూకీ తెలినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో విషప్రయోగం ద్వారా పులిని హతమార్చినట్లు నిర్థారించుకున్న పోలీసులు వారిచ్చిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పులి హత్య జరిగిన ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లి పులి కాళ్లు, గోళ్లు ఇతర అవయవాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశముంది. మరోవైపు పులి మృతిని వెలుగులోకి తీసుకొచ్చిన విలేకరిపై ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.