పూరీతో జూ.ఎన్టీఆర్ 25వ సినిమా?

jr-ntr-new-movie

యంగ్‌ టైగర్‌ జూ.ఎన్‌టిఆర్‌.. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న ‘రభస’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో లో సమంత, ఎన్‌టిఆర్‌పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఆయన కోసం పలువురు నిర్మాతలు రావడం జరుగుతోంది. తదుపరి చిత్రాలు ఏమి చేయాలనే దానిపై తను ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఒకవైపు పాటలకు స్టెప్‌లు వేసి.. ఆ తర్వాత అక్కడకు వచ్చిన దర్శకనిర్మాతల కథల్లోని పాయింట్‌ వింటున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేయనున్నట్లు సమాచారం. మహేష్‌ను ‘నేనొక్కడినే’ చిత్రం ద్వారా కొత్తగా చూపించిన సుకుమార్‌ను ఎన్టీఆర్‌ అభినందించారు.

అయితే కమర్షియల్‌గా అనుకున్నంతగా సక్సెస్‌ కాకపోయినా వైవిధ్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు ఎన్‌టిఆర్‌. ప్రస్తుతం ఎన్‌టిఆర్‌ 23వ సినిమా చేస్తున్నారు. సుకుమార్‌తో చేస్తే 24వది అవుతుంది. ఇక 25వ సినిమా ప్రతిష్టాత్మకంగా ఉండాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఆ అవకాశం ఎవరికిస్తాడో చూడాలి. ఇప్పటికే పూరీ కూడా లైన్‌లో ఉన్నాడని సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.