పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించాలి : రఘువీరా రెడ్డి

raghuveera-28

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏపిసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి

హైదరాబాద్, జనవరి 28 : పెట్రోల్ ధరల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుని దొంగదెబ్బ తీస్తున్నాయని ఏపిసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. క్రూడాయిల్ కు దగ్గట్టు పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కట్లో చమురు ధరలు తగ్గినా రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు.

విమానాలకు వాడే పెట్రోలు రూ 51.42  పైసలు ఉండగా, సామాన్యులు వాడే స్కూటర్లు, మోటారు సైకిళ్లకు వాడే పెట్రోలు మాత్రం రూ 68.86 పైసలు ఉందన్నారు. తగ్గిన క్రూడాయిల్ ధరకు తగ్గట్టుగా లీటర్ డీజిల్ 21 రూపాయలు, పెట్రోల్ 29 రూపాయలు ఉండాలన్నారు. తగ్గిన ధరల ప్రయోజనం వినియోగదారుడికి దక్కకుండా కేంద్రప్రభుత్వం దొంగచాటుగా మూడుసార్లు టాక్స్ లు పెంచారని విమర్శించారు.

ఇంత దోపిడి కేంద్రప్రభుత్వంలో జరుగుతున్నా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడటం లేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కనీసం లేఖ రాయడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నదని విమర్శించారు. ఇంత దుర్మార్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించకుండా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం టాక్స్ లు పెంచుతామనడం అన్యాయమని రఘువీరారెడ్డి అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.