పెళ్ళి చేసుకోబోతున్న సాక్షి మాలిక్

పెళ్ళి చేసుకోబోతున్న సాక్షి మాలిక్

రియో ఒలింపిక్స్ లో భారత పతకాల దాహాన్ని తీర్చిన మహిళా రెజ్లింగ్ సెన్సేషన్ సాక్షి మాలిక్ ఇప్పుడు తన మనసులో మాటని మీడియా ముందు ఉంచింది. మహిళల 58 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఈ అమ్మడి మనసుని మరో రెజ్లర్ గెలుచుకున్నాడు.  సాక్షి మీడియాకు ఈ సంగతి వెల్లడించింది. తాను పెళ్ళి చేసుకోబోతున్న వ్యక్తి పేరు బయట పెట్టనప్పటికీ త్వరలోనే తమ పెళ్లి వేడుక జరగబోతున్నట్లు తెలిపింది.      

తను చేసుకోబోయే వ్యక్తి తన లక్ష్యాలను, ఆశయాలను ఎంతో గౌరవిస్తాడని, పెళ్ళి తరువాత తనకో మంచి స్నేహితుడు లభించబోతున్నాడని ఆనందంతో చెప్పింది సాక్షి. పెళ్ళి వలన తన రెజ్లింగ్ జీవితానికి ఎటువంటి ఆటంకం తలెత్తబోదని స్పష్టం చేసింది.

స్త్రీలు రెజ్లింగ్ చేయలేరంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని, అయినా పట్టువదలక పతకాన్ని సాధించి వారందరికీ సరైన సమాధానం చెప్పడం చాలా గర్వంగా ఉందని సాక్షి వెల్లడించింది. పోటీలో రజతం గెలవలేనప్పటికీ తన పన్నెండేళ్ళ సాధనతో దేశానికి కాంస్య పతకం తీసుకురావడం తనకెంతో ఆనందానిచ్చే ఇచ్చిందని, 2020లో  టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ లో మళ్ళీ పతకం సాధించడమే తన తదుపరి లక్ష్యమని నమ్మకంగా చెప్పింది.

రియో లో కాంస్యం గెలుపొంది రెజ్లింగ్ విభాగంలో పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళా రెజ్లర్ గా రికార్డు నమోదు చేసింది సాక్షి మాలిక్. ఈ విజయంతో భారత్ లో మహిళా రెజ్లింగ్ కు ఎంతో స్ఫూర్తి నిచ్చింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.