పైసా వసూల్ చేస్తున్న ‘పైసా’ మూవీ

Paisa-review

గత సంవత్సర కాలంగా మనల్ని ఎంతగానో ఊరిస్తున్న మూవీ ‘పైసా’. ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణవంశీ తనదైన స్టైల్ లో చూపించాడు. కృష్ణవంశీ ఇంతకు ముందు సినిమాల్లో లాగానే ఈ ‘పైసా’ మూవీలో కూడా చక్కటి సోషల్ మెసేజ్ ఇచ్చారు. డబ్బు మనిషిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్లగలదు… అంతేకాదు అదే మనిషిని అద: పాతాళంలోకి నెట్టివేయగలదని తనదైన శైలిలో కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి కృష్ణవంశీ చాలా కాలం విరామం తర్వాత మళ్లీ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఫామ్ లో ఉన్న నానికి కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని అందించిందనే చెప్పాలి. మెత్తం మీద ‘పైసా’ సినిమా బాక్సాఫీస్ వద్ద పైసా వసూల్ చేస్తుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.