పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలి : తుమ్మల

police vehicles-28

ఖమ్మం జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన టాటా సుమో వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, జనవరి 28: ప్రభుత్వ శాఖలతోపాటు పోలీస్ శాఖ శాంతిభద్రతలను పరిరక్షణ కర్తవ్యాన్ని సజావుగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువై జిల్లా సమాగ్రాభివృద్ధికి తోడ్పాటునందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం సాయంత్రం ఖమ్మం పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన 56 టాటా సుమో వాహనాలను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశరరావు, జడ్ పిపి చైర్ పర్సన్ లు జెండా ఊపి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే సమర్ధవంతమైన పోలీస్ వ్యవస్థగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు మంచి పేరుందన్నారు. శాంతి భద్రతలతోనే ప్రగతి సాధ్యం అని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ వ్యవస్థను ఆధునీకరించి మరింత పరిష్టపర్చేందుకు పోలీస్ శాఖకు రూ 350 కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి పోలీస్ స్టేషనుకు నూతన ప్రభుత్వ వాహనాలను సమకూర్చిందన్నారు.

జిల్లాలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, మారుమూల గ్రామాలు అధికంగా ఉండటం, మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లా కలిగిఉండటంవల్ల పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్ పిపి చైర్ పర్సన్ కవిత, కలెక్టర్ కె.ఇలంబరిది, ఎస్ పి ఖాసిం, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.