ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ కన్నుమూత

balachander-23

హైదరాబాద్, డిసెంబర్ 23: ప్రముఖ దర్శకుడు బాలచందర్ (84) కన్నుమూశారు. కొద్ది రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్సపోందుతున్న ఆయన మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. కమలాసన్, రజనీకాంత్, సరిత, ప్రకాష్ రాజ్ వంటి ఎందరినో వెండితెరకు బాలచందర్ పరిచయం చేశారు.

తమిళనాడు, తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో 1930 జులై 9న బాలచందర్ జన్మించారు. 1960లో సినీరంగానికి పరిచయమైన బాలచందర్ 45 ఏళ్లలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 100 కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. అదే విధంగా 1973లో తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి, 1982లో ఫిల్మ్ ఫేర్ అవార్డు, 1987 లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం, అక్కినేని జాతీయ అవార్డులను బాలచందర్ అందుకున్నారు. అంతేకాకుండా మరో తొమ్మిది జాతీయ చలనచిత్ర అవార్డులు, ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న ఆయన దేశంలోని అత్యున్నతస్థాయి దర్శకుల్లో ఒకరిగా మంచి గుర్తింపు ఉంది. బాలచందర్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా భలే కోడళ్లు. బాలచందర్ కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.