ప్రజల్లో అవగాహన కల్పించాలి : జయప్రకాష్ నారాయణ

kmm-aids-1

అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వణాధికారి జయప్రకాష్ నారాయణ

ఖమ్మం, డిసెంబర్ 1: ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనికి అందరూ తమ వంతు కృష్టి చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జయప్రకాష్ నారాయణ పిలునిచ్చారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ మండలి కమిటి ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్ నుండి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 24.5 లక్షల మంది హెచ్ .ఐ.వి వ్యాదిగ్రస్తులు ఉండగా మన రాష్ట్రంలో 5 లక్షల మందితో మొదటి స్థానంలో ఉందన్నారు. 2003 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జిల్లాలో 7,37,800 వ్యక్తులకు హెచ్ ఐవి రక్త పరీక్ష నిర్వహించగా వారిలో 19,726 మందికి హెచ్ ఐవి వ్యాధిగ్రస్తులుగా నిర్ధారించబడ్డారని ఆయన తెలిపారు. అదే విధంగా 2,21,154 మంది గర్భణీ స్త్రీలకు హెచ్ ఐవి రక్త పరీక్ష నిర్వహించంగా వారిలో 1,975 మంది హెచ్ ఐవి వ్యాధిగ్రస్తులుగా నిర్ధారించినట్లు తెలిపారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్సించాల్సిన బాధ్యత అంతరిపైనా ఉందని జయప్రకాష్ నారాయణ సూచించారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ భానుప్రకాష్, అడల్ట్ ఎడ్యుకేషన్ డి.డి ఆనందకుమార్, సెట్ కామ్ సీఇఓ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.