ప్రజారాజ్యం నేతలతో పవన్ కళ్యాణ్ మంతనాలు!

Pavan-kalyan-political-entry

ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాన్ రాజకీయ ప్రవేశం ఖరారైపోయినట్టేనని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ పవన్ కళ్యాన్ అనుచరులు తనతో మంతనాలు సాగించారని తోట త్రిమూర్తులు, వంగా గీతలు వెల్లడించారు. దీంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో లోక్ సత్తా పార్టీ పవన్ రాజకీయాల్లోకి వస్తానంటే తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని ప్రకటించింది.

మరో వైపు ఆయన టీడీపీ చేరే అవకాశం ఉందని గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వీటన్నింటికీ సమాధానం తేలేందుకు మరికొద్ది రోజులే ఉన్నాయి. మరో వైపు పవన్ కళ్యాన్ పెట్టనున్న పార్టీకి ఆయన అన్నయ్య పెట్టిన పీఆర్పీ కలిసి వచ్చేలా పవన్ రిపబ్లిక్ పార్టీ(పీఆర్పీ), యువరాజ్యం పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.