ప్రతి ఇంటికీ నీరు ఇవ్వడమే వాటర్ గ్రిడ్ లక్ష్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నీరివ్వటమే వాటర్‌గ్రిడ్ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆచార్య జయశంకర్ వర్సిటీలో వాటర్ గ్రిడ్‌పై గ్రామీణ ప్రాంత ఇంజినీర్లతో సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్ధిపేటలో సమగ్ర మంచినీటి పథకాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో మంచినీరు అందించే విషయంలో అధికారులు ముఖ్యపాత్ర పోషించాలని, వేల కోట్లు వెచ్చించిన కార్యక్రమం దుర్వినియోగం కాకూడదన్నారు. కింది స్థాయి ఉద్యోగులను అవగాహన పరిచి పథకాన్ని సద్వినియోగం చేయాలని సూచించారు. ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేసుకుంటే ఆ నీరు వాడుకునే అవకాశం ఉందన్నారు. నిల్వ చేసిన నీటిలో 10 శాతం తాగునీరు, 10 శాతం పరిశ్రమలకు కేటాయించాలని కేసీఆర్ సూచించారు. అందరూ కలిసి సహకరించుకుని పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు సద్వినియోగం అవుతాయన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.