ప్రభాస్ కి సెలవులిచ్చిన రాజమౌళి

Rebel-prabhas-rajamouli

‘బాహుబలి’ షూటింగ్ ఏ సినిమా లేనంత బిజీగా తన షెడ్యుల్ ని పూర్తి చేసుకుంటుంది. రాజమౌళి ముందే షూటింగ్ లో ఏ ఒక్కరోజు కూడా వృధా చేయకుండా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. న్యూ ఇయర్ కి ఎవరి స్థాయిలో వాళ్ళు సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి మరో అడుగు ముందుకేశాడు. ఈ న్యూ ఇయర్ ఆగమనం సందర్భంగా పార్టీలు చేసుకోవడానికి వీలుగా తన ‘బాహుబలి’ షూటింగుకి సెలవలిచ్చారు.

రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన వార్ ఎపిసోడ్ చిత్రీకరణ గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున జరుగుతోంది. అయితే డిసెంబర్ 31, జనవరి 1 తేదీలను సెలెబ్రేషన్స్ రోజులుగా పరిగణించి పండగ చేస్కోండంటూ రెండు రోజుల దర్శకుడు రాజమౌళి హాలిడేస్ ప్రకటించారు. అందుకే హీరో ప్రభాస్ ఇప్పుడు మాంచి జోష్ తో వున్నాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.