ప్రభాస్ బాగానే ఉన్నాడు: బాహుబలి టీమ్

Bahubali-prabhas

బాహుబలి షూటింగ్ లో ప్రభాస్ గుర్రంపై స్వారీ చేస్తుండగా కింద పడ్డాడు, ప్రస్తుతం తను కోమాలో ఉన్నాడని వైబ్ సైట్లలో, ప్రధాన మీడియా ఛానల్లలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ బాహుబలి షూటింగ్ లో ప్రభాస్ కు ఎలాంటి గాయాలు కాలేదు. బాహుబలి షూటింగ్ లో ప్రభాస్ చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాడని బాహుబలి టీమ్ వెల్లడించింది. తనపై వచ్చిన పుకార్లలో వాస్తవం లేదని స్వయంగా ప్రభాస్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో వెల్లడించాడు.

బాహుబలి టీమ్ మెంబర్ మాట్లాడుతూ… బాహుబలి షూటింగ్ ప్రారంభం నుంచి ఏదో ఒక విధంగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి 3సార్లు ప్రభాస్ బాహుబలి షూటింగ్ లో గుర్రం స్వారీ చేస్తుండగా కింద పడ్డాడు అని రూమర్స్ వచ్చాయి. ప్రభాస్ కి గుర్రం మీద స్వారీ చేయడం, కింద పడటం తప్ప వేరే పనిలేదా.. తను షూటింగ్ లో హార్డ్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి పుకార్లను అభిమానులు ఎంతమాత్రం నమ్మవలసిన అవసరంలేదని వారు వెల్లడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.