ప్రభుత్వం పేదల కోసమే పనిచేయాలి : కేసీఆర్

మహబూబ్ నగర్, నవంబర్ 8: అర్హులైన ప్రతి పేదవాడికి పింఛన్లు ఇచ్చి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆసరా పింఛన్ల  పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా నుంచే ఆసరా పింఛన్ల పథకం ప్రారంభించాలని, 50 మందికి లబ్దిదారులకు స్వయంగా పింఛన్లను అందించాలని అనుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ పథకాన్ని ఈ జిల్లా నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు.

 

ప్రభుత్వం పేదల కోసమే పనిచేయాలి, గత ప్రభుత్వాలు వారి ఇష్టమున్నట్లుగా 30 ఏళ్ల వారికి కూడా వృద్ధుల పింఛన్లు అందించారని ఆరోపించారు. ఒక్క అర్హుడిని కూడా వదిలిపెట్టం, ఒక్క అనర్హుడికి పింఛను అన్యాయంగా ఇవ్వమని కేసీఆర్ తెలిపారు. అర్హత ఉన్నవారికి పింఛను రాకుండా ఉంటే వెంటనే సంబంధిత ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి కేసీఆర్ సూచాంచారు. అసరమైతే సీనియర్ అధికారుల చేత విచారణ జరిపించి, అర్హులైనవారికి వెంటనే పింఛను అందేలా చర్యలు చేపడతామని కేసీఆర్ పేర్కొన్నారు.

 

గత ప్రభుత్వాలు వితంతువులకు, వృద్ధులకు రూ 200 ఇచ్చేవారని, దానిని రూ 1000 లకు పెంచుతూ, క్రమం తప్పకుండా పింఛను ఈ నెల నుంచే అందించబడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా గతంలో వికలాంగులకు రూ 500 పింఛను అందించేవారని దానిని కూడా రూ 1500 పెంచుతూ ఇప్పటినుంచే ఇవ్వడం జరుగుతందని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాత పింఛన్లు తీసేస్తారని కొంత మంది ప్రచారం చేస్తున్నారని, అటువంటి అనుమానాలకు తావులేకుండా అర్హత ఉన్నవారందికి పింఛన్లను తప్పకుండా ఇస్తామన్నారు.

 

తెలుగదేశం ప్రభుత్వం పింఛన్ల కొరకు సంవత్సరానికి రూ 75 కోట్లు ఖర్చు చేయగా, అదే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రూ 1000 కొట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ 4000 కోట్లను పింఛన్ల కోసం ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇంట్లో ఉన్న సభ్యుల్లో ఒక్కొక్కరికి గతంలో 4 కిలోలు బియ్యం పంపిణీ చేసేవారని, ప్రభుత్వం 6 కిలోలకు పెంచుతూ బియ్యం పంపిణీ చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొనారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.