ప్రముఖ రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి కన్నుమూత

విశాఖపట్నం, నవంబర్ 7: ప్రముఖ రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి (85) శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నంలో కన్నుమూశారు. 1929 ఆగస్టు 19న విజయనగంలో జన్మించిన ఆమె స్త్రీవాద రచయిత్రిగా తెలుగు సాహితీ లోకంలో పేరు సాధించారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో ద్వివేదుల విశాలాక్షి సముచిత స్థానం ఉంది. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్ పట్టాను పొందారు. వీరు ఎన్నో ప్రసిద్ధ కథలు, నవలలు రచించారు. ముఖ్యంగా వైకుంఠపాళి, మారిన విలువలు, గ్రహణం విడిచింది వంటి నవలలు, భావబంధం, విశాలక్షి కథలు. ఆమె రచనల్లో ప్రముఖమైనవి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జ్యేష్ట సాహితీ అవార్డు, అడవి బాపిరాజు సాహితీ అవార్డు, రాజాలక్ష్మీ ఫౌండేషన్ సాహితీ అవార్డు, ఢిల్లీ తెలుగు అకాడమీ సాహిత్య పురస్కారం వంటి ఎన్నో అవార్డులు పొందారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.