ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం

chakri-15

(పాత చిత్రం)

హైదరాబాద్, డిసెంబర్ 15: టాలీవుడ్ ను మరో విషాద వార్త కలచివేస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40) గుండెపోటుతో తిరగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చక్రిని ఆయన కుటుంబసభ్యులు అపోలో అసుపత్రికి తరలించారు. అపోలో హాస్పిటల్ చేరిన చక్రి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ 1974 జూన్ 15న జన్మించిన ఆయన పూర్తి పేరు చక్రధర్ జిల్లా. సంగీతం మీద ఉన్న ఆసక్తితో సినిమా రంగంలో అడుగుపెట్టారు. దాదాపు 85కు పైగా చిత్రాలకు సంగీతం వహించిన చక్రి సింహ చిత్రానికి నంది అవార్డును, సత్యం సినిమాకు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచి సినిమాతో సంగీత దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన చక్రి ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, సింహ, త్యాగరాజు, దేశముదురు, మస్కా, జై బోలో తెలంగాణ, చక్రం, పోకిరీ, శివమణి, అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణిసుబ్రహ్మణ్యం, గోపి వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలోనే చక్రి తనదైన ముద్రవేసుకున్నారు. యువగాయనీ గాయకులను ఎంతోమందిని ఆయన తెలుగు సినిమాకు పరిచయం చేశారు. గాయకుడిగా కూడా చక్రి మంచి పేరును సంపాదించుకున్నారు. చక్రి మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.