ప్రముఖ సినీనటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూత

aahuti prasad-4

ఆహుతి ప్రసాద్ (పాత చిత్రం)

హైదరాబాద్, జనవరి 4: ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన్ వరప్రసాద్. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరులో 1958 జనవరి 2న జన్మించిన ఆయన చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి కలగటంతో డిగ్రీ పూర్తిచేసిన తరువాత హైదరాబాద్ ఫిల్మ్ ఇనిస్ట్సూట్ లో చేరి శిక్షణ తీసుకున్నారు. దాదాపు 275 తెలుగు చిత్రాలతోపాటు 2 తమిళం, 3 కన్నడ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.  రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ఆహుతి మూవీలో విలన్ పాత్రలో తొలిసారి నటించి మంచి గుర్తింపును సంపాదించారు. ఆ సినమాతోనే ఆహుతి ప్రసాద్ గా పేరు స్థిర పడిపోయింది. 2002లో నేను నిన్ను ప్రేమిస్తున్నా, 2007లో చందమామ సినిమాకు గాను నంది అవార్డులను ఆహుతి ప్రసాద్ అందుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.