ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూత

m s narayana-23

ఎంఎస్ నారాయణ (పాత చిత్రం)

హైదరాబాద్, జనవరి 23: ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ (63) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కొండాపూర్ లోని కిమ్స్ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సంక్రాంతి పండుగకు స్వస్థలం భీమవరంకు ఎంఎస్ వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురైన ఆయనను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పరిస్థతి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

పశ్చిమగోదావరి జిల్లా, నిడమర్రులో 1951 ఏప్రిల్ 16న జన్మించిన ఆయన పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. తెలగు సినీ అభిమానులకు ఆయన ఎమ్మెస్ నారాయణగా ఎంతో పేరు గడించిన ఆయన దాదాపు 500 లకు పూగా చిత్రాల్లో నటించారు. ఆయనకు భార్య కళాప్రపూర్ణ, ఇద్దరు పిల్లలు శశికిరణ్, విక్రమ్ ఉన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన సినిమాలపై మక్కువతో ఈ రంగంలోకి అడగుపెట్టారు. ఆయన నటించిన దూకుడు సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.