‘ప్రాణం ఖరీదుకు’ 36 ఏళ్లు

సాధారణంగా ప్రతి మనిషి సంవత్సరంలో ఒక రోజు మాత్రమే పుట్టిన రోజు ఉంటుంది. కాని మెగాస్టార్ చిరంజీవికి సంవత్సరానికి రెండు పుట్టిన రోజులు వస్తాయి. అవి ఆగస్టు 22, సెప్టెంబర్ 22. సెప్టెంబర్ 22న వచ్చే పుట్టిన రోజుకు ఒక విశేషముంది. అందేంటని ఆశ్చర్యపోతున్నారా ఈ కథ చదవండి……………..

Pranam Khareedu sakalam colఅనగనగా ఒక గ్రామంలో కనకయ్య అనే భూస్వామి ఉంటాడు. అదే గ్రామానికి చెందిన కరణం బుల్లబ్బాయి సహాయంతో కూతురు వయస్సుకు సమానమైన సీతను పెండ్లి చేసుకుంటాడు. ఆ భూస్వామి వద్ద నర్సింహుడు, దేవుడు అనే ఇద్దరు పనిచేస్తుంటారు. దేవుడు మూగవాడు అతనికి బంగారి అనే చెల్లెలుంది. బంగారి, నర్సింహుడు వివాహం చేసుకోవాలనుకుంటారు. భూస్వామి బావమరది బంగారం దేవుడు చెల్లెలిపై అఘాయిత్యం చేస్తాడు. సీత, దేవుడిపైన భూస్వామికి అనుమానం కలుగుతుంది. తర్వాత భూస్వామి అతని సీత, దేవుడిని చంపేస్తాడు. గ్రామంలోని ప్రజలు కోపోద్రిక్తులై భూస్వామి కనకయ్యను చంపేస్తారు. శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై, సిఎస్ రావు కథనం ఆధారంగా, దర్శకుడు కే.వాసు నిర్మించిన ప్రాణం ఖరీదు చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి, జయసుధ, రావుగోపాలరావు, నూతన్ ప్రసాద్, చంద్రమోహన్, చలం, రేష్మారాయ్, మాధవి తదితరులు నటించారు. కథ చదివారు కదా…

అసలు విశేషం…………

విషయం ఏమిటంటే 1978 సెప్టెంబర్ 22 న విడుదలైన ప్రాణం ఖరీదు చిత్రంతో చిరంజీవి నట జీవనానికి నాందీ పలికింది. 1978లో పునాది రాళ్లు చిరంజీవి నటించిన మొదటి సినిమా అయినప్పటికి ముందుగా విడుదలైంది ప్రాణం ఖరీదు, అందుకే చిరంజీవికి రెండో పుట్టిన రోజు సెప్టెంబర్ 22 అంటే ఈ రోజు. కాకతాళీయంగా చిరంజీవి తన అసలు పుట్టిన రోజు (ఆగస్టు 22), నటుడిగా తెరైకి వచ్చిన రోజు (సెప్టెంబర్ 22) ఈ రెండింటి మధ్య ఒక నెల మాత్రమే అంతరం ఉంది. ప్రాణం ఖరీదుతో మొదలైన చిరంజీవి 36 ఏళ్ల సినీ ప్రస్థానం తన 150వ చిత్రం ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.