ఫిబ్రవరి 4న కేసీఆర్ కు పీఎంవో ఆహ్వానం

kcr

ఢిల్లీ నుండి రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు మళ్లీ ఢిల్లీ చేరింది. ఈ నేపధ్యంలో హస్తిన ప్రయాణానికి సన్నద్ధమైన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావుకు ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశానికి సమయం ఖరారైంది. ఈ నెల 4వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రధానిని కలిసేందుకు రావాలని ప్రధాని కార్యాలయం (పీఎంవో) నుంచి కేసీఆర్ కు పిలుపు వచ్చింది. రాష్ట్ర విభజన బిల్లుకు మద్దతు కోరేందుకుగాను టీఆర్ఎస్ ఎంపీలు, ప్రజా ప్రతినిధులతో కలసి ప్రధానితో సమావేశమవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరో పక్క ఈ బిల్లుకు జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతు కూడగట్టాలని కేసీఆర్ తన బృందంతో నిన్ననే (శుక్రవారం) ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.