ఫిల్మ్ సిటీ హైదరాబాద్ కే తలమానికం : కేసీఆర్

kcr film city-13

రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 13: “రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమైన కళాఖండం, దీని నిర్మాణం వెనుక కఠోరమైన పరిశ్రమ, దీక్షతో చేస్తే తప్పా ఇలాంటి కళాఖండాలు తయారు కావు“ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూతల స్వర్గాన్ని తలపించే ఫిల్మ్ సిటీ హైదరాబాద్ లో ఉండటం తెలంగాణతోపాటు దేశానికే గర్వకారణమని కొనియాడారు. ఫిల్మ్ సిటీ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిచెందిదని, ఇది చిన్న పిల్లలకు, కాలేజి విద్యార్ధులకు హైదరాబాద్ కు ఒక బహుమతి లాంటిది కేసీఆర్. దీనిని ప్రతి వారు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశమని ఆయన తెలిపారు.

ఫిల్మ్ సిటీ నిర్మాణం, పర్యాటకులకు కల్పిస్తున్న వసతుల వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా వేస్తున్న సెట్టింగులను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మించ తలపెట్టిన ఆధ్యాత్మిక నగరి ఓం వివరాలతో కూడిన ఆల్బమ్ ను రామోజీరావు ముఖ్యమంత్రికి అందజేశారు. త్వరలో ఫిల్మ్ సిటి చేపట్టనున్న ఆద్యాత్మిక నగరం ఓం సిటీ పూర్తి అయితే హైదరాబాద్ ప్రపంచానికే తలమానికం అవుతుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీ రానున్న రోజుల్లో మరింత గొప్పగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఫిల్మ్ సిటీ సందర్శించిన వారిలో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.