బంగళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్, సెప్టెంబర్ 7: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతవరణశాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. అటు కోస్తాలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి భారీవర్షాలు, అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

flood 3

 

 

 

 

ఇప్పటికే 2 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి, విజయనగరం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ధవలేశ్వరం వద్ద గోదావరికి వరద పెరుగుతన్న దృష్ట్యా బ్యారేజీ నుండి 4.21 లక్షల క్యూసెక్కుల నీరును అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గత రెండ్రోజులుగా కురుస్తన్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాజేడు వద్ద చీకుపల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసారు. ఏటూరు నాగారంలో జీడివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

flood 1ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో భారీగా వరదనీరు చేరింది. భద్రాచలం ఏజన్సీలో రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అటు వరదనీటితో నాగావళి, వంశధార నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావం వలన శ్రీకాకుళం జిల్లా గొట్టా బ్యారేజీ నుంచి 86 వేల క్యూసెక్కుల నీరును అధికారులు కిందికి విడుదల చేస్తున్నారు. వంశధార లో ఉదృతి ప్రభావంగా 96 గ్రామలకు వరద ముంపుకు గురై అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలలు వీస్తున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.