బక్కచిక్కిన రూపాయి

బక్కచిక్కిన రూపాయి

ముంబయి : రూపాయి పరిస్థతి నానాటికి తీసికట్టు నాగంబొట్టులా తయారవుతోంది. డాలర్ తో రుపాయి మారకం విలువ 66.06కి చేరుకుంది. సోమవారం ఉదయం నుంచి రూపాయి పతనం శరవేగంగా కొనసాగుతోంది. ఆ రోజు సాయంత్రం 64.30 వద్ద డాలర్ మారకం రేటు ముగిసింది. మంగళవారం కూడా పతనం కొనసాగి 66 రుపాయల వద్ద ముగిసింది. రూపాయి పతనంపై ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ త్వరలోనే రూపాయి కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూపాయి విలువ నిలబెట్టడానికి మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. మరోవైపు స్లాక్ మార్కెట్లు తీవ్రనష్టాల పాలయ్యాయి. రూపాయి విలువ పడిపోతుండడంతో మార్కెట్ నష్టాల బాట పట్టింది. ఆహారభద్రత బిల్లు ఆమోదం పొందడం కూడా మార్కెట్ పై ప్రభావం వేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకు, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్, బి.హెచ్.యి.ఎల్, లార్సన్ అండ్ టూబ్రో, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, హిందాల్కో, ఐటిసీ, మారుతీ సుజుకి, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఇన్ఫోసిస్, డా. రెడ్డీస్, సెసా, గోవా తదితర షేర్లు లాభాలు పొందాాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.