బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం

బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ కు ఆమోదముద్ర వేసింది. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బుధవారం ఉభయ సభల్లో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.

ఇవాళ సాయంత్రం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో తన మంత్రివర్గ సహచరులతో కేబినేట్ సమావేశం నిర్వహించారు. శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టే బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో క్యాబినెట్ సమావేశం ముగిసింది. రేపు ఉదయం పది గంటలకు శాసనసభలో మంత్రి ఈటెల రాజేందర్, శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.