బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…. బంగారు బతుకమ్మ ఉయ్యాలో…..

  • వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు
  • రాష్ట్రమంతటా సంబురాలు

 

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని పది జిల్లాల్లో బతుకమ్మ శోభతో కనువిందు చేస్తున్నాయి. బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలో… అంటూ బతుకమ్మను అంగరంగ వైభవంగా ఆడి, పాడటంతో చుట్టుపక్కల మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని వీరికి జత కడుతున్నారు. సాయంత్రం అయిందంటే వీధులన్నీ బతుకమ్మ పాటలతో దద్దరిల్లి పోతున్నాయి. అన్ని వర్గాల వారు ఉత్సాహంగా ఆడిపాడి సందడి చేస్తున్నారు.

బతుకమ్మకు పుట్టినిల్లు అయిన వరంగల్ జిల్లాలో బంగారు బతుకమ్మ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. హన్మకొండలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాధోడ్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సచివాలయంలో పండుగ సందడి నెలకొంది. మహిళా ఉద్యోగులు ఘనంగా బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నారు. మంత్రి హరీష్‌రావు సతీమణి సచివాలయంలో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలకు హాజరయ్యారు. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.