బతుకమ్మ వేడుకల్లో చంద్రబాబు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 : కూకట్‌పల్లిలో మంగళవారం బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పవిత్రమైన పండుగ, కష్టజీవుల పండుగ అని అన్నారు. పేదవాళ్లు పెద్ద ఎత్తున్న చేసుకునేది ఈ బతుకమ్మ పండుగ. దేవతలు పూజించే పండుగలు అనేకం ఉండవచ్చు, ప్రకృతిని ఆరాధిస్తూ, పవిత్రమైన భావంతో ప్రకృతిని పూజించేది ఈ పండుగ అన్నారు. దేవుళ్లను పూజిస్తాం, కాని పూలను పూజించే ఏకైక పండుగ ఈ బతుకమ్మ అన్నారు. తెలుజాతిని, తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడాలని, తెలుగు వారికి సేవచేయాలని ఏకైక ధ్యేయంతో ఎన్ టి రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి ఒక్క నందమూరి తారకరామారావే అని చంద్రబాబు తెలిపారు. భౌగిళకంగా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డా తెలుగు వారందరు ఒక్కటిగానే ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రజలు పరస్పర అవగాహనతో అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు తెలిపారు. మళ్లీ తెలుగు జాతిని పూర్తిగా కలిపే పార్టీ తెలుగుదేశం తప్ప మరేది కాదని ఆయన అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.