బస్సు లారీ ఢీ : ఇద్దరు మృతి

హైదరాబాద్, నవంబర్ 30: హయత్ నగర్ మండలం పెద్దఅంబర్ పేట వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రైవేటు బస్సు పెద్ద అంబర్ పేట సమీపానికి చేరుకోగానే లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తోపాటు మరో వ్యక్తి మృతిచెందగా, 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హయత్ నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.