బాణసంచా పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

కొత్తపల్లి : తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. సోమవారం 12 మంది మృతి చెందగా చికిత్స పొందుతూ మంగళవారం ఆరుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో మణికంఠ పైర్ వర్స్ కు చెందిన బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 12 మృతి చెందగా, గాయపడిన ఆరుగురిని కాకినాడ ఆసుప్రతిలో చికిత్స పోందుతూ మంగళవారం మృతి చెందారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.