బాణసంచా పేలుడు ఘటనలో 11 మంది మృతి

కొత్తపల్లి, అక్టోబర్ 20: తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో మణికంఠ ఫైర్ వర్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా, ఏడుగురు గాయలపాలయ్యారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ప్రమాద వివరాలు తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప, కలెక్టర్ నీతూకుమారి సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. అనుమతులు లేకుండా నడిపే బాణాసంచా కేంద్రాలు మూసివేయాలని, రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు.

వాకతిప్ప పేలుడు ఘటనలో మృతిచెందిన  కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుభూతిని తెలిపారు. సోమవారం ఆయన హైదరాబాద్ విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. మృతిచెందిన వారిలో ఎక్కువ మంది మహిళలున్నారన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన రెండు లక్షల పరిహారం ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.