బాణాసంచా కేంద్రంలో పేలుడు 12 మంది మృతి

కొత్తపల్లి, అక్టోబర్ 20: తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది.  భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో పన్నెండు మంది మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. మంటల్లో చిక్కుకుని మరణించిన 12 మృతదేహాలను ఇప్పటివరకు  బయటకు తీశారు.  కొంత మంది తీవ్రంగా గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది కూలీలు పనిచేస్తున్నారు. తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.