బాధితులను పరామర్శించిన బాలకృష్ణ

balakrishna-8

పెనుగొండ బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

హిందూపురం, జనవరి 8: అనంతపురం జిల్లా పెనుగొండ బస్సు ప్రమాద బాధితులు నరకయాతన పడుతున్నారు. వాళ్ల బాధ వర్ణనాతీతంగా ఉంది. కాళ్లు చేతులు విరిగి కొందరు, ఒళ్లంత గాయాలతో ఇంకొందరు నలిగిపోతున్నారు. బిడ్డల బాధలు చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ బెంగళూరు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రమాద సంఘటనలో గాయపడిని 52 మంది హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 31 మంది విద్యార్ధులు కూడా ఉన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని విషయాలను బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లను ఆయన కోరారు. ఈ ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వ అండ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చిన పండ్లు, దుప్పట్లను క్షతగాత్రులకు అందజేశారు. ప్రభుతం అందించే సాయమే కాకుండా వ్యక్తిగతంగా బాధితుల జీవనోసాధి కోసం సహాయం చేస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ వారికి హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.