బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించిన గవర్నర్, ముఖ్యమంత్రి

bapu ghat-30

బాపూ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ

హైదరాబాద్, జనవరి 30: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని బాపూ ఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ మంత్రులు నాయిని నరసింహారెడ్డి, హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తదితరులు బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.