బాలచందర్ అంత్యక్రియలు పూర్తి

balachander-24

చెన్నై, డిసెంబర్ 24: మంగళవారం రాత్రి కన్నుమూసిన ప్రముఖ చలనచిత్ర దర్శకుడు కె. బాలచందర్ అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై బీసెంట్ నగర్ లోని శ్మశానవాటికలో అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. బాలచందర్ చివరి చూపు కోసం రాజకీయ, తెలుగు, తమిళ చిత్ర ప్రముఖులతోపాటు అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. రజనీకాంత్, ప్రకాష్ రాజ్ తదితర సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్నారు. బాలచందర్ అంతిమ యాత్రతో చెన్నై వీధులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. భారీ జనసందోహం మధ్య బీసెంట్ నగర్ శ్మశానవాటికకు చేరుకున్న ఆయన భౌతిక కాయానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు పూర్తిచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.