బాహుబలి సెట్లో ఆస్కార్ విజేత..!

Rajamouli-bahubali

రాజమౌళి నిర్మిస్తున్న ‘బాహుబలి’ షూటింగును వీక్షించడానికి ఇటీవల ఓ ఫ్రెంచ్ దర్శకుడు వచ్చాడు. ఆయన మామూలు అతిథి కాదు… రెండుసార్లు ఆస్కార్ అవార్డ్ అందుకున్న గొప్ప దర్శకుడు క్లాడే లెలౌచ్!
హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో ‘బాహుబలి’ సెట్ ని ఈ దర్శకుడు తాజాగా విజిట్ చేశాడు. “మా బాహుబలి టీమ్ మొత్తం ఆయన ఆకస్మిక సందర్శనకు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాం” అంటూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేసి, ఆ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ ఫ్రెంచ్ దర్శకుడు సుమారు 50 సినిమాలకు దర్శకత్వం వహించాడని రాజమౌళి పేర్కొన్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.