బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కన్నుమూత

Ex BJP President Bangaru Laxman Died

భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ (74) మరణించారు. సికింద్రాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం కన్నుమూశారు. 2000-01 మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు అంటే 1999-2000లో బీజేపీ హయాంలో ఆయన రైల్వే శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 1939, మార్చి 17న జన్మించిన లక్ష్మణ్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆయన జైలు కెళ్లారు. 1996లో రాజ్యసభ సభకు ఎంపికయ్యారు. ఇక దేశ రక్షణ ఒప్పందానికి సంబంధించి ఓ వ్యక్తి నుంచి లక్ష్మణ్ డబ్బులు తీసుకుంటూ ‘తెహల్కా’ పత్రిక స్ట్రింగ్ ఆపరేషన్ లో దొరికిపోయారు. ఆ ఘటన సంచలనమవడంతో 2012, ఏప్రిల్ 27న ప్రత్యేక సీబీఐ కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మణ్ కొన్ని నెలలకు బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటినుంచి హైదరాబాదులోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.